logo

సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌)లో తాజాగా విడుదలైన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో అభ్యాసకులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పది, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీలో 1942 మంది అభ్యాసకులు పరీక్షలు రాయగా ఇందులో 987 మంది ఉత్తీర్ణత సాధించారు.

Published : 07 Dec 2023 00:54 IST

‘టాస్‌’లో 50.82 శాతం ఉత్తీర్ణత

తరగతులకు హాజరైన అభ్యాసకులు

పెద్దశంకరంపేట, న్యూస్‌టుడే: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌)లో తాజాగా విడుదలైన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో అభ్యాసకులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పది, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీలో 1942 మంది అభ్యాసకులు పరీక్షలు రాయగా ఇందులో 987 మంది ఉత్తీర్ణత సాధించారు. అక్టోబర్‌ 2023లో పరీక్షలు నిర్వహించారు. వెబ్‌సైట్‌ ‌్ర్ర్ర.్మ’ః్చ-్ణ్చ-్చ్న్ప’-(‘్త్న్నః.్న౯్ణ లో ఫలితాలు పొందుపర్చారు. సంబంధిత పరీక్షల మెమోలను 15 రోజుల్లో సంబంధిత అధ్యయన కేంద్రాలకు అందజేయనున్నారు. అభ్యాసకులు రీకౌటింగ్‌ కోసం  సబ్జెక్టుకు  పదిలో రూ.350,  ఇంటర్‌లో రూ.400 చొప్పున, పునఃపరిశీలనకు సబ్జెక్టుకు పదిలో రూ.1200, ఇంటర్‌లోనూ రూ.1200 చొప్పున  మీసేవ/ టీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 7 నుంచి 16వ తేదిలోగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ డ్రైవర్‌, అంగన్‌వాడీ టీచర్‌ వంటి ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది ఈ ఓపెన్‌ స్కూల్‌లో ప్రతి ఏటా చేరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డిలలో మొత్తం 95 అధ్యాయన కేంద్రాలు ఉన్నాయి.


11 వరకు ప్రవేశాలు

వెంకటస్వామి ఉమ్మడి మెదక్‌ జిల్లా సమన్వయకర్త

సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించిన పది, ఇంటర్‌ అభ్యాసకులకు ఆయా అధ్యయన కేంద్రాల ద్వారా మార్కుల మెమోలను త్వరలో అందజేస్తాం. 2024-25 విద్యా సంవత్సరంలో చేరేందుకు ఇంకా ఈ నెల 11 వరకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని