logo

ఎమ్మెల్యే విద్యార్థిని జిందాబాద్‌!

ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చాయి కదా.. ఇవేమిటని ఆశ్చర్యపోతున్నారా! మెదక్‌ జిల్లా కూచారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన నమూనా ‘శాసనసభ ఎన్నికలి’వి. నామపత్రాల దాఖలు, అభ్యర్థుల ప్రచారం, పోల్‌ చీటీల పంపిణీ, ఏజెంట్లు, నిర్వహణ అధికారులు,

Published : 07 Dec 2023 00:55 IST

ఓటేసే విద్యార్థిని వేలికి చుక్క పెడుతూ..

ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చాయి కదా.. ఇవేమిటని ఆశ్చర్యపోతున్నారా! మెదక్‌ జిల్లా కూచారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన నమూనా ‘శాసనసభ ఎన్నికలి’వి. నామపత్రాల దాఖలు, అభ్యర్థుల ప్రచారం, పోల్‌ చీటీల పంపిణీ, ఏజెంట్లు, నిర్వహణ అధికారులు, రహస్య పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ఇవన్నీ ఉపాధ్యాయులు, విద్యాలయం ప్రత్యేకాధికారి కృష్ణతేజ పర్యవేక్షణలో విద్యార్థులు సమష్టిగా పక్కాగా బుధవారం చేపట్టారు. నమూనా ఎన్నికల్లో ఐదుగురు విద్యార్థి అభ్యర్థినులు పోటీలో ఉండగా ఒకరు విజేత అయ్యారు. ‘ఎమ్మెల్యే విద్యార్థిని’ని ఉపాధ్యాయులు సన్మానించారు. పాల్గొన్నవారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఓటు హక్కు విశిష్టతను, ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ తీరుపై అవగాహన కల్పించేలా నమూనా నిర్వహించామని కృష్ణతేజ తెలిపారు.

ఓటు వేసేందుకు వరుసలో నిల్చున్న బాలికలు

న్యూస్‌టుడే, మనోహరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని