logo

కార్యకర్తలను కాపాడుకుంటా: హరీశ్‌

ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్‌రావు గురువారం మొదటిసారి సిద్దిపేటకు రాగా ఆయన్ను కలిసేందుకు భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు.

Published : 08 Dec 2023 01:55 IST

హరీశ్‌ను కలిసిన జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, భారాస నేత రాధాకృష్ణశర్మ తదితరులు'

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్‌రావు గురువారం మొదటిసారి సిద్దిపేటకు రాగా ఆయన్ను కలిసేందుకు భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, బల్దియా అధ్యక్షురాలు కడవేర్గు మంజుల, ఉపాధ్యక్షుడు కనకరాజు, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా.షీబా, న్యాయవాదులు, జిల్లా ఆటో క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ కార్మికులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు, మైనార్టీ, మహిళా సంఘాలు, భారాస నేతలు రాధాకృష్ణశర్మ, పాల సాయిరాం, రవీందర్‌రెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, కడవేర్గు రాజనర్సు, బెదురు తిరుపతి, రవి, పట్టణ కౌన్సిలర్లు వచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పార్టీ సభ్యత్వం పొంది వివిధ కారణాలతో మృతిచెందిన 60 మందికి బీమా వర్తింపజేశామన్నారు. చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌కు చెందిన మెట్ల పర్శరాములు, ఇబ్రాహీంనగర్‌కు చెందిన పొన్నాల మల్లేశం మృతిచెందగా వారి కుటుంబసభ్యులకు గురువారం రూ.2 లక్షల విలువైన బీమా చెక్కులను అందించారు.

కొండపాక గ్రామీణ: కొండపాకకు చెందిన ఇరబోయిన లక్ష్మి, మర్పడగకు చెందిన ఆకారం కనకవ్వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. రూ.2 లక్షల బీమా చెక్కులను గురువారం హరీశ్‌రావు బాధిత కుటుంబాలకు అందించారు. నాయకులు అనంతుల ప్రశాంత్‌, ర్యాగల దుర్గయ్య, నూనె కుమార్‌ ఉన్నారు.

సిద్దిపేట క్యాంపు కార్యాలయం ఆవరణలో అభిమానులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని