logo

కేసీఆర్‌ వద్దకు భారాస నాయకులు

గజ్వేల్‌ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్‌ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం కలిశారు.

Published : 08 Dec 2023 01:59 IST

కేసీఆర్‌ను కలిసిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్‌ తదితరులు

కుకునూరుపల్లి(కొండపాక గ్రామీణ): గజ్వేల్‌ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్‌ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం కలిశారు. ఎన్నో ఏళ్ల కల కుకునూరుపల్లి మండలం ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను దగ్గర చేసినందుకుగాను మండల ప్రజల పక్షాన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మళ్లీ భారాస పార్టీకి మంచి రోజులు వస్తాయని, అందరూ ధైర్యంగా ఉండి పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్‌ సూచించారని దేవి రవీందర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచులు కిరణ్‌ కుమార్‌, మహిపాల్‌, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

ములుగు: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు నాలుగో రోజూ జన ప్రవాహం కొనసాగింది. గురువారం మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి ఆయా జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు.. కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులతో కేసీఆర్‌ మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని