logo

దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్‌

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మను కొత్తగా ఎంపికైన మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, తండ్రి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు.

Published : 08 Dec 2023 02:03 IST

ఎమ్మెల్యే రోహిత్‌రావు దంపతులను సత్కరిస్తూ..

పాపన్నపేట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మను కొత్తగా ఎంపికైన మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, తండ్రి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ మర్యాదలతో ఈవో మోహన్‌రెడ్డి.. మైనంపల్లి రోహిత్‌ దంపతులను సత్కరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఏడుపాయలను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గెలిపించినందుకు నియోజకవర్గవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ అప్ప, నాయకులు ప్రశాంత్‌ రెడ్డి, గోవింద్‌నాయక్‌, భరత్‌ గౌడ్‌, నర్సింలు తదితరులున్నారు.


నేడు మెదక్‌లో పర్యటన

మెదక్‌: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ శుక్రవారం మెదక్‌లో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందాక తొలిసారి పట్టణానికి వస్తుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటిసారి అడుగుపెట్టనుండటంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలు వాస్తు మార్పులు చేశారు. ఆగ్నేయం పెరగడంతో భవనంపై షెడ్డు నిర్మించారు. కార్యాలయంలో అటవీశాఖ వైపు ఉన్న చిన్న గేటును మూసివేయించారు. ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేశారు. మాజీ కౌన్సిలర్‌ సురేందర్‌గౌడ్‌, నాయకులు జీవన్‌రావు, బొజ్జ పవన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని