logo

సన్మార్గంలో నడిస్తేనే విశ్వశాంతి

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ముందుకు సాగితే విశ్వశాంతి సాధ్యమవుతుందని గుంటూరు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ తెలిపారు.

Published : 08 Dec 2023 02:06 IST

శిలాన్యాస కార్యక్రమంలో పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ తదితరులు

శివ్వంపేట, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ముందుకు సాగితే విశ్వశాంతి సాధ్యమవుతుందని గుంటూరు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ తెలిపారు. శివ్వంపేట మండలం గూడూరులో హైకోర్టు న్యాయవాది శివకుమార్‌గౌడ్‌ ఆధ్వరంలో నిర్మిస్తున్న శ్రీగురు పీఠంలో దత్తాత్రేయ మహాస్వామి, సాయిబాబా మందిరాలకు గురువారం శిలాన్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి హాజరైన విశ్వంజీ మహరాజ్‌ నేతృత్వంలో కొనసాగింది. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రబోధించారు. ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. శివ్వంపేట శక్తి కేంద్రంగా విరాజిల్లుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దుబ్బాక, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు. శివకుమార్‌గౌడ్‌, వెంకటేశ్వరశర్మ, జడ్చర్ల డీఎస్పీ రామారావు, డాక్టరు గూడూరు శ్రీనివాస్‌, నర్సాపూర్‌ పుర ఛైర్మన్‌ మురళీయాదవ్‌, ఎంపీపీ హరికృష్ణ, భారాస మండల అధ్యక్షుడు రమణ గౌడ్‌, పబ్బ రమేష్‌ గుప్తా, సత్యనారాయణ, నవీన్‌కుమార్‌ గుప్తా తదితరులు ఉన్నారు.

పూజలు చేస్తున్న నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మదన్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని