logo

భార్యను హత్య చేయించిన భర్త

కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో సుపారీ ఇచ్చి మొదటి భార్యను భర్త హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 11న జరిగిన మహిళ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం హవేలిఘనపూర్‌ ఠాణాలో మెదక్‌ రూరల్‌ సీఐ కేశవులు వెల్లడించారు.

Updated : 22 Feb 2024 06:32 IST

హవేలిఘనపూర్‌లో మాట్లాడుతున్న సీఐ కేశవులు

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో సుపారీ ఇచ్చి మొదటి భార్యను భర్త హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 11న జరిగిన మహిళ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం హవేలిఘనపూర్‌ ఠాణాలో మెదక్‌ రూరల్‌ సీఐ కేశవులు వెల్లడించారు. తొగిటకు చెందిన మంద ఆశయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంగమణి(51), రెండో భార్య మంజుల. పొలంతో పాటు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. సంగమణిని చంపితే రూ.20 వేలు ఇస్తానని గ్రామానికి చెందిన మహేష్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆశయ్య, మంజులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. సంగమణి ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో మహేష్‌ వంట గదిలో పొగ బయటకు వెళ్లే రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించాడు. అనంతరం తలుపులు తీయగా అదే గ్రామానికి చెందిన శివకుమార్‌ లోపలికి వచ్చి కత్తిపీటతో సంగమణి గొంతు నరికాడు. పడక గదిలో ఉన్న బ్యాగులో నుంచి రూ.20 వేలు, చెవి కమ్మలు, పుస్తెల దండ తీసుకొని వెళ్లారు. పోలీసులు నిందితులైన మహేష్‌, శివకుమార్‌లను విచారించగా హత్యచేసినట్టు అంగీకరించారు. వీరు గతంలో హత్యలకు పాల్పడ్డారు. బుధవారం వారిని రిమాండ్‌కు తరలించారు.ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌, ఏఎస్‌ఐ సమియొద్దీన్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని