logo

ఆటంకం లేని హామీల అమలుకు వేడుకున్నా

తాము ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వానికి మార్గదర్శనమిచ్చి ఆశీర్వదించాలని సమ్మక్క-సారలమ్మలను వేడుకున్నానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated : 23 Feb 2024 06:38 IST

సమ్మక్క-సారలమ్మ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: తూకంలో మంత్రి

హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తాము ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వానికి మార్గదర్శనమిచ్చి ఆశీర్వదించాలని సమ్మక్క-సారలమ్మలను వేడుకున్నానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం సాయంత్రం హుస్నాబాద్‌, పొట్టపల్లి, అక్కన్నపేటలో జరుగుతున్న జాతరలో ఆయన పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. సమ్మక్కను డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య కోయపూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. మంత్రితో హుస్నాబాద్‌లో ఎత్తుబంగారం మొక్కు కోసం కౌన్సిలర్‌ భూక్య సరోజన బంగారం తూకం వేయించారు. ఆర్డీఓ బెన్‌షాలోమ్‌, తహసీల్దారు రవీందర్‌రెడ్డి, సహకార సంఘం ఛైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలరు చిత్తారి పద్మ, టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, డీసీసీ కార్యదర్శులు హసన్‌, చిత్తారి రవీందర్‌, యాదవరెడ్డి, పున్న సది జాతరలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మలను దర్శించుకున్నారు.

కోహెడ గ్రామీణం: పరివేద, వింజపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. కమిటీ సభ్యులు  ఘనస్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని