logo

విభిన్న ఆలోచనలకు వేదిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు యూఎన్‌వో ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయా.. ఎలాంటి ఫలితాలు వచ్చాయనే విషయాలపై దేశంలోని ఆయా కళాశాలలు, యూనివర్సిటీల్లో సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘రాజ్యం-సంక్షేమ పథకాలు, సంతులిత అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశంపై రాజనీతి శాస్త్రం సెమినార్‌ను నిర్వహించనున్నారు.

Published : 23 Feb 2024 04:48 IST

నేడు, రేపు జాతీయ సెమినార్‌

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు యూఎన్‌వో ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయా.. ఎలాంటి ఫలితాలు వచ్చాయనే విషయాలపై దేశంలోని ఆయా కళాశాలలు, యూనివర్సిటీల్లో సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘రాజ్యం-సంక్షేమ పథకాలు, సంతులిత అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశంపై రాజనీతి శాస్త్రం సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో జరగనుంది. దీనికి సంబంధించి బ్రోచర్స్‌ను ఇటీవలే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆవిష్కరించారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

45 ఏళ్ల చరిత్రలో రెండోది..

కళాశాలకు 45 ఏళ్ల చరిత్ర ఉంది.17 గ్రూపులు ఉన్నాయి. 1522 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌తో పాటు టాస్క్‌, క్యాంపస్‌ ఎంపికలు తదితర అంశాలతో పాటు ఇటీవల న్యాక్‌ గుర్తింపు సైతం సాధించింది. 2017 ఫిబ్రవరి 3, 4 తేదిల్లో చరిత్రకు సంబంధించిన జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించగా, నేడు, రేపు జరిగేది రెండోది కావడం విశేషం. నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హుస్సేన్‌ వ్యవహరించనున్నారు.

కలిగే ప్రయోజనాలు..

  • దేశ వ్యాప్తంగా కళాశాలకు గుర్తింపు వస్తుంది.
  • అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తుల విభిన్న ఆలోచనలను పంచుకునే అవకాశం ఉంది.
  • కళాశాల విద్యార్థుల్లో పరిశోధన, భాషా, అధ్యయన నైపుణ్యాలు, ప్రశ్నించే తత్వం, కొత్తవారితో సంబంధాలు పెరుగుతాయి.

చక్కటి అవకాశం..

  • సెమినార్‌లో పాల్గొనే వారు పీజీ, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు కావడంతో కచ్చితంగా రెండు పరిశోధన పత్రాలు ప్రదర్శించి ప్రచురించాలి. ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించే అవకాశం ఉండడంతో మంచి గుర్తింపు వస్తుంది.
  • ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 103 సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించిన అంశాలపై ప్రదర్శన ఇవ్వనున్నారు.

కళాశాలకు ప్రత్యేక గుర్తింపు

డాక్టర్‌ హుస్సేన్‌, ప్రిన్సిపల్‌

సెమినార్‌లో పాల్గొన్న విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 150 దరఖాస్తులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని