logo

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్‌

ఈనెల 16న మెల్లూరు ప్రాథమిక పాఠశాలకు ఉదయం ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేదు. ఉపాధ్యాయురాలు రజిత సెలవుపై వెళ్లగా.. ఎంఈవో పాఠశాలను పరిశీలిస్తున్నారని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి ఉదయం 11.30 గంటలకు వచ్చారు.

Published : 24 Feb 2024 02:54 IST

ఉసిరికపల్లిలో ప్రార్థన చేయిస్తున్న ఎంఈవో బుచ్చానాయక్‌

వెల్దుర్తి, న్యూస్‌టుడే: ఈనెల 16న మెల్లూరు ప్రాథమిక పాఠశాలకు ఉదయం ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేదు. ఉపాధ్యాయురాలు రజిత సెలవుపై వెళ్లగా.. ఎంఈవో పాఠశాలను పరిశీలిస్తున్నారని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి ఉదయం 11.30 గంటలకు వచ్చారు. ఈ విషయమై 17న ‘ఈనాడు’లో ‘గురువులు రాక.. బడి నడవక’ శీర్షికన కథనం వచ్చింది. స్పందించిన డీఈవో రాధాకృష్ణ ఎంఈవో యాదగిరితో విచారణ జరిపించి శుక్రవారం హెచ్‌ఎం వెంకట్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

సమయపాలన పాటించకుంటే చర్యలు

శివ్వంపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల ఆలస్యంపై ‘ఈనాడు’లో ‘బడి గంట కొట్టినా.. సార్లు రాలేదు!’ శీర్షికన ఈనెల 21న వచ్చిన కథనానికి ఎంఈవో బుచ్చానాయక్‌ స్పందించారు. ఉసిరికపల్లి, ఎదుల్లాపూర్‌ పాఠశాలలను శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని