logo

రాతి గుట్టను మింగేస్తున్నారు!

భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ జోరుగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, తీసుకున్న అనుమతులకు అదనంగా మరి కొందరు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.

Updated : 13 Apr 2024 05:50 IST

యంత్రంతో రాతి కడీలను కోస్తున్న కార్మికుడు
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ జోరుగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, తీసుకున్న అనుమతులకు అదనంగా మరి కొందరు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. పట్టణ పరిసరాలతో పాటు బైపాస్‌ రోడ్డు పక్కనే ఉన్న రాతి గుట్టల్లో రాత్రి, పగలు తేడా లేకుండా రాళ్లు, కంకర, రాతి కడీలను తయారు చేసి కొందరు విక్రయిస్తున్నారు. అక్రమ మైనింగ్‌, తయారీని నియంత్రించాల్సిన రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో మైనింగ్‌ శాఖ భారీగా ఆదాయం కోల్పోతుంది. రాతి కడీల బండల నుంచి వేగంగా కోయడానికి జనరేటర్‌ ఏర్పాటు చేసుకుని యంత్రంతో పని చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో కోసి ఒక్కోటి రూ.250 నుంచి రూ.280కి విక్రస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి అక్రమ వ్యాపారాన్ని నియంత్రించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై మైనింగ్‌ ఏడీ వెంకటరమణను వివరణ కోరేందుకు పలు దఫాలుగా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని