logo

ఆన్‌లైన్‌ ఆర్టీఐ దరఖాస్తులు

సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికి అందుబాటులో ఉండేలా, ఆన్‌లైన్‌ విధానంలో ఆర్టీఐ దరఖాస్తుల స్వీకరించేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఏపీ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 13 Apr 2024 20:39 IST

భువనగిరి: సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికి అందుబాటులో ఉండేలా, ఆన్‌లైన్‌ విధానంలో ఆర్టీఐ దరఖాస్తుల స్వీకరించేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఏపీ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. భువనగిరిలోని పెన్షనర్స్ భవనంలో సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి, సేవా సదన్ డైరెక్టర్ మహ్మద్ ఖుర్షీద్ పాషా అధ్యక్షతన శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే లోక్ పాల్ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి  మజ్జి ఇంజనీరింగ్ చీఫ్ పంచాయత్ రాజ్ ఎం ఏ కరీం , జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటి రెడ్డి  మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని