రేషన్ ఈ- కేవైసీకి మరో అవకాశం.. త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారుల సూచన
ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది.
రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని, త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,740 గ్రామ పంచాయతీలకు గానూ 2,081 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో మొత్తం 10,07,214 రేషన్ కార్డులుండగా, 29,85,553 మంది రేషన్ లబ్ధిదారులున్నారు. ఇంకా వివిధ కారణాల వల్ల 7,96,023 మంది ఈ కేవైసీ చేయించుకోనట్లుగా అధికారవర్గాలు తెలుపుతున్నాయి.
సంక్షేమ పథకాలు అర్హుల లబ్ధికే..
సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈ- కేవైసీ తప్పనిసరి చేసింది. దీని కోసం శాఖాపరంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఈ విషయమై తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు సూచించారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరోమారు అవకాశం కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ప్రధాన సమస్యలివే..
వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కొంతమేర జాప్యం జరుగుతోంది. దీనికితోడు చిన్నారుల ఆధార్ నవీకరణ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు వృద్ధుల వేలిముద్రలు పడటం లేదు. మీసేవా, ఆధార్ కేంద్రాలకు వెళ్లి నవీకరణ పూర్తి చేసుకున్నా ఈ కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడంలేదు. వలస వెళ్లిన వారి కోసం అక్కడుండే రేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్నా కొందరు డీలర్లు తమ పరిధిలోని వారికే కేవైసీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేవైసీ ఆవశ్యకత విషయమై రేషన్ డీలర్లకు, లబ్ధిదారులకు అధికారులు పలు రకాలుగా సూచనలు చేస్తూనే ఉన్నారు. అవకాశం ఉందికదా అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్‌కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్‌పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్‌కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే