logo

ఓటు ఒక్కటి.. పోలింగ్‌ కేంద్రాలు రెండు

ఈ చిత్రంలో కన్పిస్తున్న పోల్‌ చిట్టీలో పోలింగ్‌ కేంద్రం పేరు వద్ద ఆంగ్లంలో ఒక కేంద్రం, తెలుగులో మరో కేంద్రం పేరు అచ్చయింది. ఇలాంటి పోల్‌ చిట్టీలు పట్టణంలో ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్లకు వచ్చినట్లు వారు చెబుతున్నారు.

Updated : 22 May 2024 05:45 IST

హుజూర్‌నగర్, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో కన్పిస్తున్న పోల్‌ చిట్టీలో పోలింగ్‌ కేంద్రం పేరు వద్ద ఆంగ్లంలో ఒక కేంద్రం, తెలుగులో మరో కేంద్రం పేరు అచ్చయింది. ఇలాంటి పోల్‌ చిట్టీలు పట్టణంలో ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్లకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా పంపిణీ చేస్తున్న పోల్‌ చిట్టీల్లో పోలింగ్‌ కేంద్రం చిరునామాలో తెలుగు, ఆంగ్లంలో రెండు వేర్వేరు చిరునామాలు అచ్చు వేశారు. దీంతో అసలు తాము ఏ కేంద్రంలో ఓటు వేయాలా అనే గందరగోళంలో ఉన్నారు. ఏది సరైందోనని వారు అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. కొన్ని పార్టీల నాయకులు ప్రచారం కోసం ఇళ్లకు వెళ్లినప్పుడు ఓటర్లు వారిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రచారం చేసే వారు కూడా అధికారుల దగ్గరకు వెళ్లడంతో, అధికారులు బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా చూసి సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి పోవాలని సూచిస్తున్నట్లు తెలిసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని