logo

దేవరకొండ గాంధీ

పట్టణానికి చెందిన మునగాల కొండల్‌రావును దేవరకొండ గాంధీగా పిలుస్తుంటారు. స్వాతంత్య్రానంతరం చాలామంది విద్యకు దూరంగా ఉండేవారు.

Updated : 22 May 2024 04:30 IST

దేవరకొండ, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన మునగాల కొండల్‌రావును దేవరకొండ గాంధీగా పిలుస్తుంటారు. స్వాతంత్య్రానంతరం చాలామంది విద్యకు దూరంగా ఉండేవారు. అక్షరాస్యతను పెంపొందించాలనే సంకల్పంతో ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ కళాశాలల నిర్మాణం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రభుత్వ విద్యాలయాల నిర్మాణాలకు విరాళాలు అందించేవారు. ఆ రోజుల్లో దేవరకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉదయం ఇంటర్, మధ్యాహ్నం డిగ్రీ తరగతులు కొనసాగేవి. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే కార్పస్‌ ఫండ్‌ చెల్లించాలి.

ఇది ఖర్చుతో కూడిన విషయం కావడంతో ఎవరు ముందుకు రాకపోయేవారు. 1984లో మునగాల కొండల్‌రావు తన ఇంటి ముందున్న స్థలాన్ని విక్రయించి రూ.2 లక్షలతో (ప్రస్తుతం దాని విలువ రూ.కోట్లలో ఉంటుంది) డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విశ్వవిద్యాలయానికి రూ.2 లక్షల కార్పస్‌ ఫండ్‌ చెల్లించారు. దీంతో మిషన్‌ కంపౌండ్‌ వద్ద ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యను అభ్యసిస్తూ ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఉన్నారు. విద్యాభివృద్దికి తోడ్పడుతున్న మునగాల కొండల్‌రావు పేరును డిగ్రీ కళాశాలకు నామకరణం చేయాలని అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అభీష్టం మేరకు దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్తుతం మునగాల కొండల్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని