logo

ఎంజీయూ ఇన్‌ఛార్జి వీసీగా నవీన్‌ మిత్తల్‌

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌ నియమితులయ్యారు.

Published : 22 May 2024 02:48 IST

నల్గొండ టౌన్, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వీసీ ఆచార్య గోపాల్‌రెడ్డి పదవీకాలం ఈ నెల 21తో ముగిసింది. 2007లో ప్రారంభమైన ఎంజీయూకు ఇప్పటి వరకు గంగాధర్, కట్టా నర్సింహ్మారెడ్డి, ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్, గోపాల్‌రెడ్డి రెగ్యూలర్‌ వీసీలుగా పనిచేశారు. ఇన్‌ఛార్జి వీసీలుగా పలువురు ఐఏఎస్‌ అధికారులు, ఇతర విశ్వవిద్యాలయాల వీసీలు పనిచేశారు. తాజాగా ప్రభుత్వం నవీన్‌మిత్తల్‌కు బాధ్యతలు అప్పగించింది. నూతన ఇన్‌ఛార్జి వీసీ విశ్వవిద్యాలయంలోని సమస్యలు పరిష్కరించి, వర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులు కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని