logo

Telangana Election Results: నల్గొండలో నాడు ఎన్టీఆర్‌.. నేడు కోమటిరెడ్డి

ఆంధ్రుల అన్నగా సుపరిచితమైన నందమూరి తారక రామారావు 1985లో నల్గొండ అసెంబ్లీకి  పోటీ చేశారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మందడి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు.

Updated : 04 Dec 2023 07:44 IST

కనగల్‌, న్యూస్‌టుడే: ఆంధ్రుల అన్నగా సుపరిచితమైన నందమూరి తారక రామారావు(NTR) 1985లో నల్గొండ అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మందడి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 49,788 ఓట్లు రాగా.. మందడి రామచంద్రారెడ్డికి 18,202 ఓట్లు వచ్చాయి. అప్పట్లో 31,587 ఓట్ల మెజార్టీతో ఎన్టీ రామారావు విజయం సాధించారు. తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో భారాస అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 54,332 ఓట్లతో విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 1,07,405 ఓట్లు రాగా.. కంచర్ల భూపాల్‌రెడ్డికి 53,073 ఓట్లువచ్చాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజార్టీ. 2004లో తెదేపా అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 22,738 ఓట్ల మెజార్టీ పొందారు. 1994 సీపీఎం అభ్యర్థి నంద్యాల నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై 29,163 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో భారాస అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై(Komatireddy Venkat Reddy) 23,698 ఓట్ల మెజార్టీ లభించింది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాధించిన మెజార్టీనే(telangana election results) అత్యధికంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని