logo

నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు

చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే.

Updated : 07 Dec 2023 02:58 IST

మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రతి ఆర్నెల్లకోసారి చొప్పున ఇప్పటికి అయిదేళ్లుగా ప్రభుత్వం పొడిగిస్తూ వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారని, నూతన పాలకవర్గాలు ఎన్నిక చేసి సహకార సంఘాలకు జీవం పోస్తారని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చేనేత, సిల్క్‌, ఉన్ని, మరమగ్గాల సహకార సంఘాలు 375 వరకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 85 సంఘాలున్నాయి. ఈ సహకార సంఘాల పాలకవర్గాలకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. వారి అయిదేళ్ల పదవీకాలం 2018 ఫిబ్రవరి 9తో ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలంటే నలభై రోజుల ముందుగా ఈ నెలాఖరులో నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. 2018లోనే అన్ని చేనేత సహకార సంఘాల్లో ఓటు హక్కుకు అర్హత ఉన్న చేనేత పారిశ్రామికుల జాబితాలను చేనేత, జౌళి సిద్ధం చేయించింది. ‘ఒక్కరి కోసం అందరు- అందరి కోసం ఒక్కరు’ అనే సహకార స్ఫూర్తితో నెలకొల్పిన ఈ సహకార సంఘాలకు సమర్ధ, పట్టుదల, అంకితభావం, దార్శనికత గల పాలకవర్గాలను ఎన్నిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు