logo

వారూ ఓటేశారు..!

Published : 07 Dec 2023 03:28 IST

ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల పోలింగ్‌ 64 శాతం

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: తమను అందరూ వెలేసినట్లు చూడడం, చులకనగా భావిస్తారనే ఆలోచన నుంచి బయటకు వచ్చిన పలువురు ట్రాన్స్‌జెండర్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో 64 శాతం ట్రాన్స్‌జెండర్‌ పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 200 మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా 128 తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆలేరులో వంద శాతం..

ఉమ్మడి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం వంద శాతం ట్రాన్స్‌జెండర్‌ పోలింగ్‌తో మొదటి స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 19 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అతి తక్కువగా భువనగిరిలో ఒక్కరే ఓటరు ఉండగా.. ఆ ఒక్కరూ ఓటు వేయలేదు. అత్యధికంగా ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 54 మంది ఉన్న నల్గొండలో పోలింగ్‌ 66.67 శాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని