logo

రైతుల ఖాతాల్లో రూ. 598 కోట్లు జమ

జిల్లాలో 191 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్‌వో వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

Published : 07 Dec 2023 03:53 IST

మాడ్గులపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డీఎస్‌వో వెంకటేశ్వర్లు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో 191 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్‌వో వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడలోని రైస్‌ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు 3,02,158 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.598 కోట్లు జమ చేశామన్నారు. మిల్లర్లకు కస్టం మిల్లింగ్‌ కోసం 2,98,723 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పంపగా.. 2,74,195 మెట్రిక్‌ టన్నుల బియ్యం దిగుమతి అయిందన్నారు. వారి వెంట పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నాగేశ్వరరావు, డీటీ జావేద్‌ తదితరులు ఉన్నారు.

మాడ్గులపల్లి: తుపాను దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రైతులు భద్రపర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. మాడ్గులపల్లి మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాలు వస్తుండటంతో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని