logo

లక్ష్యాన్ని పూర్తి చేయాలి

వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హన్మంతు కె.జెండగె అన్నారు.

Published : 08 Dec 2023 02:53 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హన్మంతు కె.జెండగె

భువనగిరి, న్యూస్‌టుడే: వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హన్మంతు కె.జెండగె అన్నారు. కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన రైస్‌ మిల్లర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్ణీత వ్యవధిలో కస్టం మిల్లింగ్‌ లక్ష్యాన్ని పూర్తి చేసి తోడ్పాటు అందించాలని అన్నారు. జిల్లా పరిధిలోని 44 మిల్లులకు 1.91లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం ఉందన్నారు. ఇప్పటి వరకు 1.65లక్షల టన్నుల సీఎంఆర్‌ పూర్తి అయిందని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. మార్కెట్‌కు వస్తున్న ధాన్యాన్ని వారంలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.44లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. 20,800 రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.430 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని అన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ గోపికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు