logo

20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక

చేనేత ఇక్కత్‌ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు.

Updated : 08 Dec 2023 06:24 IST

బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: చేనేత ఇక్కత్‌ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లిని ఈనెల 20న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్రపతి రాక ఏర్పాట్లలో భాగంగా సభాప్రాంగణాన్ని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. చేనేత సహకార సంఘం, గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ 18న శీతాకాల విడిదికి రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తున్నారని.. పోచంపల్లిలో చేనేత వస్త్రకళ నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు 20న ఇక్కడికి వస్తున్నట్లు వివరించారు. దాదాపు 500మంది చేనేత కార్మికులతో కలిసి సమావేశంలో ప్రసంగిస్తారని, జిల్లాలోని సంత్‌ కబీర్‌, పద్మశ్రీ అవార్డులు పొందిన చేనేత కళాకారులతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కళాకారులు రూపొందిస్తున్న చీరల ప్రదర్శన, నాలుగు మగ్గాలను ఏర్పాటు చేసి చేనేత వస్త్రాల తయారీని తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తహసీల్దార్‌ వీరాబాయి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, తడ్క రమేష్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని