logo

జాతీయ ఉత్తమ రైతుగా బీచ్చు

జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు.

Published : 08 Dec 2023 02:55 IST

అవార్డు అందుకుంటున్న రైతు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: జాతీయ ఉత్తమ రైతుగా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన భూక్యా బీచ్చు ఎంపికయ్యారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన ఐసీఏఆర్‌ కృషి జాగరణ్‌మేళాలో ఉత్తమ మిలియనీర్‌ రైతు అవార్డు అందజేశారు. వినూత్న పంటల సాగుచేస్తూ ఆదర్శంగా నిలిచినందుకు ఆయనకు ఈ అవార్డు వచ్చినట్లు కేవీకే ప్రోగ్రాం ఇన్‌ఛార్జి డి.నరేష్‌ తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తల ప్రోత్సాహం, సహకారంతో ఏటా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి జాగరణ్‌ సంయుక్తంగా ఏటా మిలీనియం ఫార్మర్స్‌ మీట్లో ఉత్తమ రైతులను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల ఆరు నుంచి మూడు రోజుల పాటు దిల్లీలో జరిగిన మేళాలో తెలంగాణ నుంచి నలుగురు ఎంపికయ్యారు. పదేళ్లుగా శాస్త్రవేత్తలు సూచించిన సాంకేతిక పరిజ్ఞానంతో, వారి సలహాలు, సూచనలు పాటిస్తూ సాగులో కొత్తగా వచ్చే మార్పులకు అనుగుణంగా మిరప, కూరగాయలు, పత్తి, వరి సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దోస, బెండ సాగుచేస్తూ లాభాల బాటలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. రైతును కేవీకే కార్యదర్శి స్నేహలత, డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు