logo

తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనం

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

Updated : 08 Dec 2023 06:23 IST

ప్రత్యేక శిబిరంలో పాలసీలు స్వీకరిస్తున్న పోస్టల్‌ సిబ్బంది

నడిగూడెం, న్యూస్‌టుడే: కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాద బీమాను గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పాలసీ పేరుతో ప్రారంభించింది. ఏడాదికి రూ.399, రూ.396 చెల్లిస్తే రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అనేక ప్రయోజనాలు కల్పించారు. దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పాలసీలు స్వీకరిస్తున్నారు.  

పాలసీ ఇలా:

ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంక్‌ తన కస్టమర్లకు గ్రూప్‌ యాక్సిడెంట్‌ బీమా పాలసీ అందిస్తోంది. 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు దీన్ని తీసుకోవచ్చు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం జరిగి, వైద్యం కోసం అస్పత్రిలో చేరితే ఐపీడీ కింద రూ.60వేలు, ఔట్‌పేషెంట్‌కు రూ.30 వేలు ఇస్తారు. విద్య ప్రయోజనానికి గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు రుసుములో 10 శాతం లేదా రూ.లక్ష వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనాలకు రూ.25వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని