logo

పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ.. కాంగ్రెస్‌దే హవా

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది.

Published : 08 Dec 2023 03:00 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల సాధనలోనూ సత్తా చాటింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, రక్షణ సిబ్బందితో పాటు 80 ఏళ్లు పై బడిన వృద్ధులు, దివ్యాంగులకు సైతం(ఇంటి వద్దనే) పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో భారీ ఆధిక్యాన్ని కాంగ్రెస్‌ కనబరచింది.

సూర్యాపేటలో ఆధిక్యం

సూర్యాపేట నియోజకవర్గంలో ఓటమి చవి చూసిన కాంగ్రెస్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో మాత్రం సత్తా చాటింది. ఇక్కడ మొత్తం 3,105 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1,852 ఓట్లు సాధించగా.. విజేతగా నిలిచిన భారాస అభ్యర్థి జగదీశ్‌రెడ్డి 710 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక్కడ భాజపా అభ్యర్థి వెంకటేశ్వరరావు సైతం 335 ఓట్లు సాధించారు. నల్గొండలోనూ భాజపా, ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు వరుసగా 275, 258 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సాధించారు. మిగిలిన చోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై భాజపా, ఇతర అభ్యర్థుల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని