logo

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల

మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది.

Updated : 08 Dec 2023 06:22 IST

మూసీ గేట్ల స్పిల్‌వే మీదుగా దిగువకు వెళుతున్న నీరు

కేతేపల్లి,న్యూస్‌టుడే: మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. వర్షంతో మూసీ ఎగువ ప్రాంతాల వాగులు, వంకలనుంచి వరదనీరు వస్తుంది. దీంతో గురువారం రెండు క్రస్టు గేట్లను ఎత్తి వాటి ద్వారా అధికారులు దిగువ మూసీకి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును ఒక అడుగు ఎత్తుమేర లేపి 712 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 141.55 క్యూసెక్కుల వరదనీరు వస్తుంది. ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువలకు 291 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని మూసీ డ్యామ్‌ ఇంజినీర్‌ డి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు. రిజర్వాయర్‌లో ఆవిరి, డ్యామ్‌ సీపేజీ, లీకేజీల రూపంలో 65 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. గేట్ల ద్వారా, కాలువలకు, ఆవిరిరూపంలో మొత్తం 1078 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం రాత్రివరకు 644.10 అడుగుల నీరు రిజర్వాయర్‌లో ఉంది. రిజర్వాయర్‌ నీటినిలువ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా 4.10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈడాది వర్షాకాలంలో 33వేల ఎకరాల్లో పంటలకు పూర్తిగా నీరందించిన రిజర్వాయర్‌ ఎప్పటికప్పుడు హైదరాబాద్‌ నగరం నుంచి నిరంతరం వస్తున్న నీటితో నిండుతూ కళకళలాడుతుంది. యాసంగి సాగు ప్రారంభమయ్యే ప్రస్తుతం ఇప్పటికే మూసీ నిండుకుండలా తొణికిసలాడుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని