logo

సాయుధ దళాల పతాక నిధికి సహకరించాలి: కలెక్టర్‌

సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అన్నారు.

Published : 08 Dec 2023 03:05 IST

జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అన్నారు. సాయుధ పతాక దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ, స్కౌట్‌, మాజీ సైనికులు గురువారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. దేశ రక్షణలో  సాయుధ దళాల పాత్ర వెలకట్ట లేనిదన్నారు. సైనిక సంక్షేమ శాఖ అధికారి మక్బూల్‌ హైమద్‌ మాట్లాడుతూ.. యుద్ధంలో గాయపడిన వీరమరణం పొందిన వారి సహాయార్థం ఆర్థికంగా చేయుటకు రాష్ట్రస్థాయిలో గవర్నర్‌ ఆధ్వర్యంలో పతాక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి గడియారం మీదుగా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, శివ, నర్సింహా, అంజద్‌, హషీం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని