logo

దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు.

Published : 08 Dec 2023 16:06 IST

భువనగిరి: దివ్యాంగుల సాధికారత అవార్డులకు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగ సంక్షేమ అధికారి జి. అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన దివ్వాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డ్ 2023 కోసం ఆసక్తి గల దివ్యాంగుల నుంచి, దివ్యాంగుల కోసం పనిచేస్తున్న వివిధ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉత్తమ ఉద్యోగి, ఉత్తమ స్వీయ ఉద్యోగి, ఉత్తమ వ్యక్తిగత సామాజిక కార్యకర్త, ఉత్తమ క్రీడా వ్యక్తి, ఉత్తమ సంస్థ, బెస్ట్ ఎంప్లాయర్, దివ్యాంగుల కోసం అందుబాటులో ఉండే విభాగం, సాంస్కృతిక కార్యక్రమాలలో వైకల్యాలున్న వ్యక్తులకు అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 10 తేదీలోగా అన్ని వివరాలతో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని