logo

ఆకతాయిల బైక్‌ రైడింగ్‌.. అడ్డుకట్ట పడేదెలా!

జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై స్టంట్లు వేస్తూ ఇతర వాహనాలతో పాటు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

Updated : 22 Feb 2024 09:51 IST

నల్గొండ ఐటీ టవర్‌ ఎదురుగా నామ ఫలకలు లేని ద్విచక్ర వాహనాలతో స్టంట్లు వేస్తున్న యువకులు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై స్టంట్లు వేస్తూ ఇతర వాహనాలతో పాటు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డుతో పాటు నూతనంగా నిర్మాణం చేపట్టిన ఐటీహబ్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురు నుంచి వల్లభరావు చెరువు వద్దకు వెళ్లే రోడ్డుపై రైడింగ్‌ చేసేవారి సంఖ్య పెరుగుతుంది. ఐటీ హబ్‌ ముందు ఉదయం, సాయంత్రం విద్యా సంస్థల ప్రారంభ, ముగింపు సమయంలో ఇలాంటి ఆకతాయిలు ఎక్కువగా కన్పిస్తున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా ద్విచక్ర వాహనాలకు నామఫలకలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు తీసుకునే వారే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌, సిబ్బందితో పాటు సంబంధిత స్టేషన్‌ అధికారులు పెట్రోలింగ్‌ పెంచాల్సిన అవసరం ఉంది. ఆదిలోనే ఆకతాయిలకు అడ్డుకట్ట వేయక పోతే పరిస్థితి మరింత తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం లేక పోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని