logo

అంకమ్మతల్లి ఆలయంలో ప్రెస్‌మీటా..?

నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డితో కలిసి అంకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Published : 13 Apr 2024 02:56 IST

ఆలయంలో విలేకరుల సమావేశంలో
విజయసాయిరెడ్డి, పక్కనే మధుసూదన్‌యాదవ్‌, మానుగుంట మహీధర్‌రెడ్డి

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డితో కలిసి అంకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోనే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి.. అమ్మవారి బంగారు కిరీటానికి రూ.40 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్‌యాదవ్‌ ఆలయ నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. అంకమ్మతల్లి.. తమను ఎన్నికల్లో గెలిపించాలని కోరుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి కందుకూరు అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకం ఉందన్నారు. బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఇక్కడ వైకాపా తరఫున(రాజకీయాలు దేవాలయంలో మాట్లాడకూడదంటూనే) పోటీలో ఉన్నారనీ, వీరిద్దరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌ సహకారంతో.. ఆలయ నిర్మాణానికి దేవాదాయ, ధర్మాదాయశాఖ నుంచి రూ.1.15 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఇప్పటికే రూ.6.40 కోట్లతో ఆలయ నిర్మాణం, రూ.3.50 కోట్లతో అలివేటి మండపం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని