logo

పోలీస్‌ సిబ్బంది సంక్షేమమే ధ్యేయం

పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దినోత్సవం నిర్వహించారు.

Published : 13 Apr 2024 03:00 IST

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సస్పెన్షన్‌, డిజర్షన్‌ నుంచి విధులకు తీసుకోవడం, ఉద్యోగోన్నతులు, బదిలీలు, సర్వీసు సంబంధిత సమస్యలు, గ్రేడ్‌ ఇంక్రిమెంట్లు, డిప్యుటేషన్‌, భద్రత, హౌసింగ్‌ రుణాలు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల సెల్‌ ఇన్‌ఛార్జి ఏఎస్సై శ్రావణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కోవూరు, విడవలూరు : కోవూరు, కొడవలూరు, విడవలూరు పోలీసు స్టేషన్లను ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపు సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని