logo

18 నుంచి నామినేషన్ల ప్రక్రియ

: ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తవుతుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Published : 13 Apr 2024 03:11 IST

కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ 

లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తవుతుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీకి సంబంధిత ఆర్వో కార్యాలయం, లోక్‌సభకు కలెక్టరేట్‌లోని ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఆర్వో కార్యాలయం గేటు నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉందన్నారు. ఇప్పుడు తీసుకున్న వాహనాలకు అనుమతులన్నీ ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి ముగుస్తాయన్నారు. 18 నుంచి పార్టీ అధ్యక్షుడికి మాత్రమే ఒక వాహనానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రచారంలో వినియోగించే వాహనాలకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు.  అంతకుముందు కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించి.. సూచనలు చేశారు. డీఆర్వో లవన్న, ఈవీఎం నోడల్‌ అధికారి పద్మాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్‌ ఏవో మధుసూదనశర్మ, వైకాపా, తెదేపా, భాజపా, సీపీఐ ప్రతినిధులు మురళీధర్‌రెడ్డి, జి.నారాయణ, రసూల్‌, సురేంద్రబాబు, శ్రీనివాస్‌, అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని