logo

మరోసారి.. మరింత దిగజారి

ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైనా.. ర్యాంకుల్లో జిల్లా వెనుకబడింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో ఆరో స్థానం దక్కింది.

Published : 13 Apr 2024 03:14 IST

ప్రథమంలో 8, ద్వితీయలో 6వ స్థానం 

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైనా.. ర్యాంకుల్లో జిల్లా వెనుకబడింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో ఆరో స్థానం దక్కింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 69శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఫలితాలు సాధించారు. కరోనాకు ముందు రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉండగా- ఆ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. ఫలితాల్లో బాలుర కంటే బాలికల హవా కొనసాగింది.

ద్వితీయ సంవత్సరంలో...21,293 మంది పరీక్షలు రాయగా.. 17,292 మంది ఉత్తీర్ణులై 81 శాతంగా,  వృత్తి విద్యా కోర్సుల్లో 1074 మంది పరీక్ష రాయగా.. 769 మంది ఉత్తీర్ణులై.. 72శాతంగా నమోదైంది.

ప్రథమలో... 24,620 మంది పరీక్షలు రాయగా.. 17,100 మంది ఉత్తీర్ణులై.. ఫలితం 69 శాతంగా.. వృత్తివిద్యా కోర్సుల్లో 1,009 మంది రాయగా.. 647 మంది ఉత్తీర్ణులై 64 శాతంగా నమోదైంది.

బాలికలు 72 శాతం ఉత్తీర్ణత.. ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి సంవత్సరంలో బాలికలు 11,790కు 8,464 మంది ఉత్తీర్ణత సాధించి 72 శాతం, బాలురు 12,830కి 8,636 మంది ఉత్తీర్ణులై 67 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 10,473కు 8,797 మంది ఉత్తీర్ణులై 84 శాతం, బాలురు 10,820కి 8,495 మంది ఉత్తీర్ణులయ్యారు. 79 శాతంగా నమోదైంది.


మంచి ఫలితాలు

 డాక్టర్‌ ఎ.శ్రీనివాసులు ఆర్‌ఐవో

ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంప్రూమెంట్‌ రాసే వారికి మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు పరీక్షలు రెండు పూటలా ఉంటాయి. పరీక్ష ఫీజు ఈ నెల 18 నుంచి 24లోపు చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని