logo

అటవీ భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు వెంటనే అమలుపరచాలని ఏపీ హేతువాద సంఘం డిమాండు చేసింది.

Updated : 13 Apr 2024 19:15 IST

కావలి: అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు వెంటనే అమలుపరచాలని ఏపీ హేతువాద సంఘం డిమాండు చేసింది. కావలి రైల్వే రోడ్డులోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య మాట్లాడారు. గుడ్లూరు మండలం చేవూరులోని అటవీ భూమిని మార్తాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ స్థలంలో " రామదూత అశ్రమం " నిర్మించి యోగాలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి దొంగస్వామి అక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుని, అతనిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జవహర్ భారతి విశ్రాంత తెలుగు లెక్చరర్ చంచయ్య, కృష్ణారెడ్డి, హేతువాద సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని