logo

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. డ్రైవర్‌ మృతి

దగదర్తి మండలం సున్నపుబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

Updated : 22 May 2024 12:25 IST

కావలి: దగదర్తి మండలం సున్నపుబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మృతి చెందాడు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  విజయవాడ నుంచి చెన్నై వైపునకు వెళ్తున్న స్లీపర్‌ కోచ్ ట్రావెల్స్‌ బస్సు దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కావలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌  శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.  క్షతగాత్రులను 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని