logo

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి సమయాన్ని అదనుగా చూసుకుని అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. మండలంలో భీమవరప్పాడు, సాయిపేట, ఇస్కదామెర్ల, గరిమెనపెంట తదితర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు.

Published : 25 May 2024 02:45 IST

పోలీసులు పట్టుకున్న ట్రాక్టరు (పాతచిత్రం) 

కొండాపురం, న్యూస్‌టుడే: మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి సమయాన్ని అదనుగా చూసుకుని అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. మండలంలో భీమవరప్పాడు, సాయిపేట, ఇస్కదామెర్ల, గరిమెనపెంట తదితర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే భవన, వివిధ నిర్మాణాలకు సంబంధిత అధికారుల అనుమతితో ఇసుకను సరఫరా చేయాల్సి ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుక మాఫియా మండలంలో రెచ్చిపోతోంది. పగలు సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మాత్రమే అధికారులు పట్టుకోగలుగుతున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు మాఫియా రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 5 గంటలలోపు అక్రమ రవాణా సాగిస్తున్నారు. -

  • ప్రస్తుతం ట్రక్కు ఇసుక సుమారు రూ. 4500 వరకు పలుకుతోంది. ఇతర మండలాలకు సరఫరా చేస్తే రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో రవాణాను కొనసాగిస్తూ పోలీసు, సెబ్‌ అధికారులకు టోకరా వేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎవరైనా అధికారులకు సమాచారం అందజేస్తే కింది స్థాయి సిబ్బంది కొందరు మాఫియాకు చేరవేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
  • ప్రధానంగా భీమవరప్పాడు, సాయిపేట గ్రామాల్లోని వాగుల నుంచి రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
  • ఈ విషయమై ఎస్సై మహేంద్ర వివణ కోరగా తమకు సమాచారం అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి మండల ప్రజల సహకారం అవసరమన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని