logo

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 17 టేబుళ్లు

నిబంధనలు పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 25 May 2024 02:57 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: నిబంధనలు పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్‌ అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు అందించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుళ్లతో పాటు రెండు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్‌ మొత్తం 17 టేబుళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని తెలిపారు. వీసీ బాపిరెడ్డి, నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అధికారి సురేష్,  రిటర్నింగ్‌ అధికారులు సేతు మాధవన్, వికాస్‌ మర్మత్, విద్యాధరి, చిన్నఓబులేసు, మలోల, ప్రేమ్‌కుమార్, మధులత తదితరులు పాల్గొన్నారు. 

నలుగురు పరిశీలకుల నియామకం

నెల్లూరు(నగరపాలక సంస్థ) : ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నలుగురు పరిశీలకులను భారత ఎన్నికల సంఘం నియమించింది. కందుకూరు, నెల్లూరురూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు రామ్‌కుమార్‌గౌతమ్, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలకు టీజీ అభిలాష్‌కుమార్, కోవూరు, నెల్లూరునగరం, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు నితిన్‌ సింగ్‌ బదారియ, సర్వేపల్లికి జయేంద్ర కుమార్‌ విజయవత్‌ పరిశీలకులుగా వ్యవహరించునున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని