logo

రూ. 5 కోట్ల స్థలం కబ్జా

కంచే చేను మేసిందన్న చందంగా.. జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానం అధీనంలోని ఇరిగేషన్‌ భూమిపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. కొంత కాలం కిందటే దాన్ని కాజేయాలన్న యత్నాలు ప్రారంభించి.. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ..

Published : 25 May 2024 02:59 IST

జొన్నవాడ దేవస్థానం అధీనంలోని భూమికి ఎసరు 

కంచే చేను మేసిందన్న చందంగా.. జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానం అధీనంలోని ఇరిగేషన్‌ భూమిపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. కొంత కాలం కిందటే దాన్ని కాజేయాలన్న యత్నాలు ప్రారంభించి.. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ.. దానికి కార్యరూపం ఇచ్చారు. స్థలాన్ని చదును చేసి.. గ్రావెల్‌ తోలారు. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే : జొన్నవాడ దేవస్థానానికి ఎదుట.. ఏపీ టూరిజంకు దక్షిణాన, పెన్నానదికి ఉత్తరం వైపు సర్వే నంబరు 129లో కొంత.. 91సీలో మరికొంత.. మొత్తంగా నీటిపారుదలశాఖకు చెందిన ఎకరా స్థలాన్ని దిగమింగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ స్థలాన్ని చదును చేసి.. గ్రావెల్‌ తోలారు. దేవస్థానంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తే.. ఈ కబ్జాకు పాల్పడినట్లు గ్రామస్థులు, భక్తులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో పార్కింగ్, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు ఈ స్థలం ఎంతో అనువుగా ఉండేది. ఇంతకు ముందు దేవస్థానానికి సంబంధించిన పూలతోపుగా ఉండేది. ఇంతటి కీలకమైన.. అదీ దేవస్థానానికి చెందిన స్థలాన్ని ఆక్రమించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో.. దేవస్థానం కోసం అనేలా చదను, గ్రావెల్‌ తోలి.. ఆ ముసుగులో ఆక్రమణకు పాల్పడ్డారన్న విమర్శలు నెలకొన్నాయి. గ్రామస్థులు దీనిపై ఆర్డీవో మాలోలకు ఫిర్యాదుచేశారు. తగు చర్యలు తీసుకుని స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. 

ఆర్డీవో, పోలీసులకు ఫిర్యాదు చేస్తా

వి.గిరికృష్ణ, ఈవో

కబ్జాపై ఆర్డీవో, పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కబ్జాదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామస్థులు, భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని