logo

తూకం దుకాణంలో పాఠ్యపుస్తకాలు

ఏటా ప్రభుత్వ పాఠశాలలకు.. పుస్తకాలు అరకొరగానే అందుతున్నాయన్న.. విమర్శలు ఉన్న నేపథ్యంలో.. అనంతసాగరంలోని ఓ తూకం దుకాణంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు దర్శనమివ్వడంతో శనివారం మండల వ్యాప్తంగా చర్చనీయంశమైంది.

Published : 26 May 2024 02:45 IST

అనంతసాగరంలో కలకలం

అనంతసాగరం : ఏటా ప్రభుత్వ పాఠశాలలకు.. పుస్తకాలు అరకొరగానే అందుతున్నాయన్న.. విమర్శలు ఉన్న నేపథ్యంలో.. అనంతసాగరంలోని ఓ తూకం దుకాణంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు దర్శనమివ్వడంతో శనివారం మండల వ్యాప్తంగా చర్చనీయంశమైంది. ఎంఈవో కార్యాలయంలో ఉండాల్సిన ఈ పుస్తకాలను స్థానిక ఎంఈవో, మరో వ్యక్తితో కలిసి విక్రయించినట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై ఎంఈవో బాలక్రిష్ణారెడ్డిని వివరణ కోరగా- కలువాయి ఎంఈవోగా అదనపు బాధ్యతలు ఉండటంతో.. గత రెండు రోజులుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నానని.. తూకం దుకాణానికి తరలించిన పుస్తకాలు రెండేళ్ల క్రితం విద్యాసంవత్సరానికి సంబంధించిన కాలం చెల్లినవని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, వాటిని తిరిగి కార్యాలయానికి తెప్పించామన్నారు.  అయిదురోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న తనపై ఎవరో కక్షపూరితంగానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎంఈవో కార్యాలయంలో పనిచేసే ఓ సీఆర్‌పీ.. ఆటోలో పుస్తకాలను అమ్మకానికి తీసుకువచ్చినట్లు సదరు దుకాణాదారుడు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని