logo

అక్రమ ఖనిజం పట్టివేత

పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల నుంచి తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ టిప్పర్‌ నేలలోకి దిగబడి గ్రామస్థులకు పట్టుబడింది.

Published : 26 May 2024 02:47 IST

వావిలేరు సమీపంలో పట్టుబడిన తెల్లరాయి టిప్పర్‌

చేజర్ల, న్యూస్‌టుడే: పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల నుంచి తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ టిప్పర్‌ నేలలోకి దిగబడి గ్రామస్థులకు పట్టుబడింది. మండలంలోని వావిలేరులోని ప్రభుత్వ, ఆలయ భూముల్లో కొందరు  గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మైనింగ్‌ సాగిస్తున్నారు. ఆలయమాన్యం నుంచి వెలికితీసిన ఖనిజాన్ని శుక్రవారం రాత్రి టిప్పర్‌లో నింపి తీసుకెళుతుండగా మార్గమధ్యలో నేలలోకి దిగిపోయింది. శనివారం ఉదయాన్నే టిప్పర్‌ను గుర్తించిన గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్‌ ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని గనుల శాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని