logo

ముగిసిన పెంచలకోన బ్రహ్మోత్సవాలు

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి గోనుపల్లిలో జరిగిన గ్రామోత్సవంతో వైభవంగా ముగిశాయి.

Published : 26 May 2024 02:50 IST

కోన నుంచి గోనుపల్లికి తరలిపోతున్న ఉత్సవమూర్తులు..

పెంచలకోన(రాపూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి గోనుపల్లిలో జరిగిన గ్రామోత్సవంతో వైభవంగా ముగిశాయి. ముందుగా పెంచలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులు బ్రహ్మోత్సవాల ముగింపు పూజలందుకున్నారు.

ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్లు

అనంతరం గోవిందనామ స్మరణలు, పలు రకాల వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పెంచలస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి అత్తగారిల్లైన గోనుపల్లి వరకు సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన భక్తులు ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యువత సంప్రదాయ నృత్యాలు, కేరింతలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం పెంచలకోన ముఖద్వారం వద్ద ఉత్సవమూర్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయసాగర్‌బాబు నేతృత్వంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు కలిసి  వీడ్కోలు పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు