logo

పాలతిప్ప గుల్ల

మండలంలోని మినగల్లు.. చరితగల నేల. ఇక్కడి చెట్టు చేమలు.. కొండలు, గుట్టలు చారిత్రక చిహ్నాలు. ఏం ప్రయోజనం.. ప్రస్తుతం ఈ ప్రాంతం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది.

Published : 29 Nov 2022 01:47 IST

వందల టిప్పర్లతో అక్రమ రవాణా

పొక్లెయిన్‌తో గ్రావెల్‌ తవ్వకం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: మండలంలోని మినగల్లు.. చరితగల నేల. ఇక్కడి చెట్టు చేమలు.. కొండలు, గుట్టలు చారిత్రక చిహ్నాలు. ఏం ప్రయోజనం.. ప్రస్తుతం ఈ ప్రాంతం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే ఇక్కడి తిప్పలను తవ్వి.. రూ. కోట్లు సంపాదించిన అక్రమార్కుల కన్ను.. చారిత్రక ఆనవాళ్లున్న మినగల్లులోని పాలతిప్పపై పడింది. రాత్రింబవళ్లు ఇక్కడి గ్రావెల్‌ను అడ్డంగా బొక్కేస్తున్నారు. సొమ్ములు.. సొంత ప్రయోజనాలే ముఖ్యం.. గ్రామం ఏమైనా మాకు అనవసరం అనేలా మాఫియా నడుస్తోంది. పాలతిప్పను తవ్వి.. రోజూ వందల టిప్పర్లలో తరలిస్తున్నారు. రాత్రిపూట టిప్పర్ల జోరుతో గ్రామస్థులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఓ వైకాపా నాయకుడి కనుసన్నల్లో ఈ అనధికార అక్రమాలు యథేచ్ఛగా సాగుతుండగా- మైనింగ్‌, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అక్రమార్కుల చర్యలతో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అనుమతులు లేవు  ప్రమీల, తహసీల్దారు

మినగల్లులోని పాలతిప్ప తవ్వి.. గ్రావెల్‌ తరలించాలని ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా తరలిస్తే కఠినచర్యలు తప్పవు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని