logo

Chinta Mohan: తిరుపతిని ఏపీ రాజధాని చేయాలి..: చింతా మోహన్‌ డిమాండ్‌

తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  తుళ్లూరు, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపోయారన్నారు.

Updated : 25 Feb 2024 08:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న చింతా మోహన్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), మనుబోలు : తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  తుళ్లూరు, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపోయారన్నారు. తిరుపతి రాజధాని అవుతుందని 300 సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాశారన్నారు. రాపూరు నుంచి ఏర్పేడు వరకు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయనీ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, 7 విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్‌, విద్యాలయాలు, నీటి వనరులు ఇలా రాజధాని చేసేందుకు అన్ని అనుకూలతలున్నాయని వివరించారు.  దళితులు, మైనార్టీలు, ఉద్యోగులు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వెయ్యనున్నారని వెల్లడించారు.ఎన్నికల్లో దేశంలో భాజపాకు 150లోపే సీట్లు వస్తాయనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులున్నారు. మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ మనుబోలులో విలేకరులతో మాట్లాడారు. ఆయన వెంట సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాయకులు పూల చంద్రశేఖర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని