logo

పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార వాణిజ్య ప్రాంగణాలు, ప్రతీ దుకాణంలోనూ చెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ....

Published : 03 Apr 2024 12:06 IST

నెల్లూరు కలెక్టరేట్‌ : నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార వాణిజ్య ప్రాంగణాలు, ప్రతీ దుకాణంలోనూ చెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధిస్తామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. బుధవారం ఆయన  స్థానిక స్టోన్ హౌస్ పేట, ఆత్మకూరు బస్టాండు తదితర ప్రాంతాల్లో పూల విక్రయ దుకాణాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా దుకాణాల యజమానులు, ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ నాయకులతో మాట్లాడారు.  వ్యాపార, వాణిజ్య ప్రాంగణాల్లో  చెత్త బుట్టలను తప్పనిసరిగా వినియోగించాలని, వాటిపై నగర పాలక సంస్థ కేటాయించిన లోగో స్టిక్కర్‌ను అతికించాలని సూచించారు. వినియోగదారులు చెత్త బుట్టలను ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందజేయాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని