logo

వేసవి శిక్షణ.. సృజనకు పదును

పిల్లలూ.. లేచింది మొదలుకొని పుస్తకాలతో కుస్తీపడుతూ.. పరీక్షల భయంతో.. మీకు ఇష్టమైన ఆటలు, చిత్రలేఖనం, నృత్యం వంటి వాటికి సమయం కేటాయించలేకపోయామని దిగులు చెందుతున్నారా.. వేసవి సెలవులు వస్తున్నాయ్‌.. ఈ సమయాన్ని వృథా చేయకుండా మీకిష్టమైన దాంట్లో తర్ఫీదు పొందితే ఆ రంగంలో రాణించొచ్చు.

Published : 13 Apr 2024 04:09 IST

ఉమ్మడి జిల్లాలో శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం, కామారెడ్డి పట్టణం

పిల్లలూ.. లేచింది మొదలుకొని పుస్తకాలతో కుస్తీపడుతూ.. పరీక్షల భయంతో.. మీకు ఇష్టమైన ఆటలు, చిత్రలేఖనం, నృత్యం వంటి వాటికి సమయం కేటాయించలేకపోయామని దిగులు చెందుతున్నారా.. వేసవి సెలవులు వస్తున్నాయ్‌.. ఈ సమయాన్ని వృథా చేయకుండా మీకిష్టమైన దాంట్లో తర్ఫీదు పొందితే ఆ రంగంలో రాణించొచ్చు. ఉమ్మడి జిల్లాలో ఎన్నో సంస్థలు నామమాత్రపు రుసుంతో యోగా, ధ్యానం, కర్రసాము, తెలుగు భాష, నైతిక విలువలు, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం వంటి అంశాల్లో వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. అందుబాటులోని శిబిరాలకు వెళ్లి మీ సృజనాత్మకతకు పదునుపెట్టండి.


భగవద్గీత తరగతులు

  • శ్రీవిపంచి సంస్థ, జనార్దన్‌ ఫంక్షన్‌హాల్‌, సాయినగర్‌, వర్నిరోడ్‌, నిజామాబాద్‌
  • భగవద్గీత శ్లోకాల కంఠస్థం, అర్థ వివరణ, శాస్త్రీయ నృత్యం, భారతీయ చిత్రకళ
  • ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు

సంప్రదించాల్సింది: తిరునగిరి గిరిజా గాయత్రి

  • సంస్థ పేరు  
  • అంశాలు
  • ఎన్ని రోజులు

వ్యక్తిత్వ వికాసం

  • ఆర్యసమాజ్‌, ఇందూరు శాఖ, కస్బాగల్లీ, వైదిక సత్సంగభవన్‌, నిజామాబాద్‌
  • ధ్యానం, యోగా, ప్రాణాయామం, కర్రసాము, వేదమంత్ర పఠనం, భగవద్గీత శ్లోకాల కంఠస్థం, నైతిక విలువలు, నీతికథలు, వ్యక్తిత్వ వికాసం 
  • మే 3 నుంచి 11 వరకు

నైతిక విలువలపై..

  • రామకృష్ణ విద్యానికేతన్‌, శివాజీనగర్‌, నిజామాబాద్‌
  • ప్రార్థన, శాస్త్రీయ, హిందూస్థానీ, సెమిక్లాసికల్‌ నృత్యం, వేద గణితం, యోగా, ఆంగ్లభాషపై పట్టు, భజనలు, నైతిక కథలపై శిక్షణ
  • ఈ నెల 26 నుంచి మే నెల 15 వరకు (ఉదయం 8.30 నుంచి 11.30 వరకు)    

చిత్రలేఖనం.. ఆకృతుల తయారీ

  • రామకృష్ణ సేవా సమితి, గంగాస్థాన్‌-2లోని రామకృష్ణ ధ్యానమందిరం, నిజామాబాద్‌ జిల్లా కేంద్రం  
  • చేతిరాత, స్ఫూర్తిదాయక కథలు, ధ్యానం, నైతిక విలువలు, జనరల్‌ ఇంగ్లీష్‌, తైక్వాండో, యోగా, చిత్రలేఖనం, వృథావస్తువులతో ఆకృతుల తయారీ, సంగీతం (5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు)  
  • ఈ నెల 25 నుంచి మే 31 వరకు (ఉదయం 7.30 నుంచి 12.30 వరకు)  

శిశుమందిర్‌ ఆధ్వర్యంలో

  • సంస్కృతి వేసవి శిబిరం, సరస్వతీ శిశుమందిర్‌, కామారెడ్డి
  • చిత్రలేఖనం, సంగీతం, కోలాటం, చెక్కభజన, సంస్కృతికి అద్దంపట్టే వివిధ అంశాలు
  • మే 1 నుంచి 15 రోజుల పాటు

కరాటేలో తర్ఫీదు

  • నం.1 మార్షల్‌ ఆర్ట్స్‌, హౌసింగ్‌బోర్డుకాలనీ, కామారెడ్డి
  • కరాటే, కుంగ్‌ఫూ, మార్షల్‌ ఆర్ట్స్‌
  • మే 1 నుంచి 30 రోజులు  

నృత్యంలో..

  • సనాతన సాంస్కృతిక సంస్థ, కామారెడ్డి
  • భరతనాట్యం, కూచిపూడి, జానపద కళలు
  • మే నెల  నుంచి ప్రారంభమవుతుంది.  

కర్రసాములో..

  • రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఇందూరు శాఖ, ఎస్‌ఎస్‌ఆర్‌ డిస్కవరీ  పాఠశాల, మాధవనగర్‌, నిజామాబాద్‌  
  • కర్రసాము, యోగాసాధన, ప్రాణాయామం, ఆటపాటలతో దేశభక్తి ప్రబోధం.  
  • ఈ నెల 26 నుంచి 28 వరకు 

యువ నిర్మాణ శిబిరం

  • ఆర్ష గురుకులం, కామారెడ్డి, స్వామి బ్రహ్మానంద సరస్వతి పర్యవేక్షణలో..
  • యోగా, కర్రసాము, ఆటపాటలు, బ్రహ్మ, దేవయజ్ఞంపై అవగాహన
  • ఈ నెల 21 నుంచి 28 వరకు (8వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు)

బోధన్‌లో..

  • ఆర్యసమాజ్‌ దయానంద గోశాల
  • యోగాశిక్షణ,  కర్రసాము, వేదజ్ఞానం, సదాచారం, ఆహారం, ఆరోగ్యం, కళలు (8 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులు)
  • ఈ నెల 26 నుంచి మే 2 వరకు 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని