logo

రూ.7.21 లక్షల నగదు పట్టివేత

జిల్లా కేంద్రం నాలుగో ఠాణా పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు పట్టుకున్నట్లు ఏసీపీ రాజావెంకటరెడ్డి, నగర సీఐ నరహరి తెలిపారు.

Published : 13 Apr 2024 04:20 IST

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం నాలుగో ఠాణా పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు పట్టుకున్నట్లు ఏసీపీ రాజావెంకటరెడ్డి, నగర సీఐ నరహరి తెలిపారు. శుక్రవారం ఎల్లమ్మగుట్ట వద్ద ఎస్సైలు సంజీవ్‌, రామకృష్ణ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా మోర దీపక్‌ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.7.21 లక్షలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌ ట్రెజరీలో జమచేసి, ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పత్రాలు లేకుండా నగదు రవాణా చేస్తే చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని