logo

నవజాత శిశువులకు.. ప్రాణరక్ష

ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ అనే పరికరం గుండె లయకు సంబంధించింది. శిశువు గుండె చప్పుడు ఆగిన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ యంత్రానికి రెండు ఫ్యాడ్లను అనుసంధానించి శిశువు ఛాతిపై పెడతారు. గుండె సరైన రీతిలో పనిచేసేలా చూస్తారు.

Updated : 13 Apr 2024 05:47 IST

అంబులెన్స్‌లో ప్రత్యేక సేవలు 
గుండె పనితీరు పరిశీలించేందుకు...
ఇన్‌ఫ్యూజన్‌ పంపు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ అనే పరికరం గుండె లయకు సంబంధించింది. శిశువు గుండె చప్పుడు ఆగిన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ యంత్రానికి రెండు ఫ్యాడ్లను అనుసంధానించి శిశువు ఛాతిపై పెడతారు. గుండె సరైన రీతిలో పనిచేసేలా చూస్తారు.

 

అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, సౌకర్యాలు, మందులు ఉండవు. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్దామంటే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శిశువుల సంరక్షణ కోసం అనేక సదుపాయాలు, నూతన పరికరాలతో అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 83418 00828 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వాహనం సేవలు పొందొచ్చు.

మల్టీ ఛానల్‌ మానిటరింగ్‌

శిశువు పల్స్‌రేట్‌, బీపీ వంటివి మల్టీఛానల్‌ మానిటరింగ్‌ అనే పరికరంలో చూస్తారు. అంబులెన్స్‌లో శిశువును ఉంచినప్పటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు పల్స్‌రేట్‌ను వైద్య సిబ్బంది చూస్తుంటారు. దీని బట్టి అవసరమైన చికిత్స అందిస్తారు. దీంతో పాటు శిశువుకు సమయానుకూలంగా తగిన మోతాదులో ఇంజెక్షన్‌ అందించేందుకు ఇన్‌ఫ్యూజన్‌ పంపు అనే పరికరం ఉంటుంది.

వెచ్చని వాతావరణం కల్పించేలా.. 

అప్పుడే పుట్టిన శిశువుల్లో పచ్చకామెర్లు, ఇతర ఆనారోగ్య సమస్యలు తలెత్తితే తల్లి గర్భంలో ఉన్నట్లు వెచ్చని వాతావరణం కల్పిస్తారు. ఇందుకోసం రేడియంట్‌ వార్మర్‌ అనే పరికరాన్ని అందుబాటులో ఉంచారు. శిశువుకు అవసరమైన ఉష్ణోగ్రత కూడా అది అందిస్తుంది. వీటితో పాటు అంబులెన్స్‌లో కృత్రిమ వెంటిలేటర్‌ ఉంచారు. నంజు బయటకు తీసేలా ప్రత్యేక పరికరాలు ఉన్నాయి.


సద్వినియోగం చేసుకోవాలి

- బానేశ్‌, టెక్నీషియన్‌

అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని