logo

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైంది

హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని భారాస ఎమ్మెల్యే, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Published : 13 Apr 2024 19:37 IST

ఎల్లారెడ్డి పట్టణం: హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని భారాస ఎమ్మెల్యే, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి భారాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధికి కృషి చేస్తానని భారాస అభ్యర్థి అనిల్ కుమార్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ, సొసైటీ ఛైర్మన్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు