logo

ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి

ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ఐఎన్టీయూసీ ఉద్యోగ, కార్మిక యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు అన్నారు.

Published : 13 Apr 2024 19:58 IST

కామారెడ్డి పట్టణం: ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ఐఎన్టీయూసీ ఉద్యోగ, కార్మిక యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని అధికారికంగా ప్రకటించాలని కోరామన్నారు. అనంతరం సంస్థ డిపో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా రమేశ్, అధ్యక్షుడిగా భాస్కర్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ప్రతినిధులు డీవీకే రావు, మల్లేశ్, రమేశ్ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని