logo

తక్కువైనా పర్వాలేదు.. ఎక్కువ కావొద్దు!

ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం నెలకొంది.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సభలు.. ర్యాలీలు.. భోజనాలు, వాహనాలు ఇలా.. ఎన్నో ఖర్చులు ఉంటాయి.

Updated : 22 Apr 2024 07:16 IST

ప్రచారంలో ప్రతి పనికీ లెక్క!

ఎన్నికల కోసం  వీడియోతో  ప్రత్యేక పరిశీలక వాహనం 

ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం నెలకొంది.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సభలు.. ర్యాలీలు.. భోజనాలు, వాహనాలు ఇలా.. ఎన్నో ఖర్చులు ఉంటాయి. రణరంగంలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశించింది. వీటని పక్కాగా అమలు చేయడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది. వీరు నిత్యం పరిశీలిస్తూ ఖర్చు లెక్కిస్తారు. హద్దు దాటతే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. అభ్యర్థులూ తస్మాత్‌ జాగ్రత్త..!!

న్యూస్‌టుడే, ఆర్మూర్‌: లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం నిమిత్తం ఈసీఐ వ్యయ పరిమితిని రూ.95 లక్షల వరకు నిర్ణయించింది. పరిమితి దాటి ఖర్చు చేసినా, వాటికి సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించకున్నా అభ్యర్థులపై వేటు వేసేలా ఎన్నికల సంఘం నిబంధనలున్నాయి. నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికల ఖర్చు లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో నూతన ఖాతా తెరవాల్సి ఉంటుంది. అదే ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్‌కు ముందు అభ్యర్థులు చేపట్టిన ప్రచారాలు, సభలు ఇతర కార్యక్రమాల ఖర్చులను సంబంధిత పార్టీల ఖర్చు కింద జమ చేస్తారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. నామినేషన్‌ తర్వాత అభ్యర్థులు చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యయపరిశీలకులు నీడలా వెంటాడుతారు.

హద్దు దాటితే వేటే

ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ తమ పూర్తిస్థాయి ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా, వ్యయానికి సంబంధించిన లెక్కలను సమయంలో చూపకున్నా సంబంధిత వ్యక్తులపై వేటు పడటంతో పాటు తర్వాతి ఎన్నికల్లో పోటీచేసే హక్కు కోల్పోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలు (రూ.)

  • వీడియో చిత్రీకరణ: 45,000 (నెలకు)
  • ఫంక్షన్‌హాల్‌ (రోజుకు): 20,000
  • బెలూన్‌ (బిన్‌సైజ్‌): 20,000
  • టీ: 10
  • స్నాక్స్‌: 15
  • లెమన్‌,
  • రైస్‌ ప్యాకెట్‌: 40
  • డప్పులు (ఒకరికి): 700
  • ప్రచార రథం: 3,000
  • హోటల్‌ ఛార్జీలు (రోజుకు): 2,000
  • టెంట్‌ సామగ్రి: 12,000
  • ఎల్‌ఈడీ స్క్రీన్‌: 5,000
  • కళాబృందాలు (ఒకరికి): 1,000
  • పవర్‌ జనరేటర్‌: 7,000
  • కూలర్‌: 1500
  • పోస్టర్లు: 5,000
  • హోర్డింగులు: 6,000
  • టెంట్‌ (18/36): 2,500
  • బ్యానర్లు (దుస్తులు): 6000
  • పోడియం, పెండర్‌ నిర్మాణం: 150
  • యాంప్లీఫైర్‌, మైక్రోఫోన్‌: 2,500
  • లైటింగ్‌ ఛార్జీలు (రోజుకు ఎల్‌ఈడీ): 200

వాహనాలు (డ్రైవర్‌తో సహ):

  • ఇన్నోవా 3,500
  • త్రీవీలర్లు 1500
  • సుమో 3,000
  • వ్యాన్‌ 7,000
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు